Saturday, November 15, 2025
Homeనేషనల్Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. శీతాకాలంలో స్నానానికి వేడి నీళ్లు..!

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. శీతాకాలంలో స్నానానికి వేడి నీళ్లు..!

Hot Water Facility in Vande Bharat trains: రైలు ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలను కల్పిస్తూ దూసుకుపోతోంది భారతీయ రైల్వే. రైల్వే శాఖ తాజాగా మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. శీతాకాలంలో ప్రయాణికుల ఇబ్బందులను తీర్చేందుకు గానూ వేడి నీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా రైళ్లలో స్నానం చేసే వారి కోసం వేడి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లలో సుదూర ప్రయాణీకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికైతే, ఢిల్లీ నుంచి కశ్మీర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ వేడి నీటి సౌకర్యాన్ని ఉచితంగానే అందిస్తోంది భారతీయ రైల్వే. ఫస్ట్ ఏసీ ప్రయాణీకులకు మాత్రమే ఈ ఉచిత హాట్ షవర్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. వందే భారత్‌తో పాటు రాజధాని, దురంతో, ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్లతో పాటు మరికొన్ని స్పెషల్‌ ట్రైన్లలో త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

డయాబెటిక్‌ రోగుల కోసం ప్రత్యేక ఆహారం..

మరోవైపు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఐఆర్‌సీటీసీ డయాబెటిక్ రోగుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డయాబెటిక్‌ రోగుల కోసం ప్రత్యేక ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఇక నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని ప్రీమియం ట్రైన్‌లో ఈ ప్రత్యేక ఆహారాన్ని అందించనుంది రైల్వేశాఖ. ఈ ప్రత్యేక భోజనానికి ప్రయాణికుల నుంచి అధికారులు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. కాగా, డయాబెటిక్‌ రోగుల సౌకర్యార్థం ఈ సేవలను తీసుకొచ్చినట్లు భారతీయ రైల్వే తెలిపింది. ప్రపంచంలో ఎక్కవ శాతం మధుమేహ వ్యాధిగ్రస్తులు మన దేశంలోనే ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నారు. మన దేశంలో దాదాపు 22 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే రైల్వేలు ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి. రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం ఈ సౌకర్యం కొన్ని రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్‌తో సహా అన్ని ప్రీపెయిడ్ రైళ్లలో ఐదు రకాల ఆహారాలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి శాఖాహారం, మాంసాహారం, జైన్ ఆహారం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం. మీకు నచ్చినదాన్ని మీరు ఎంచుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం కోసం రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad