Saturday, November 15, 2025
Homeనేషనల్Ajit Doval: ఒక్క వెంట్రుకతో పాక్ అణు రహస్యాన్ని ఛేదించిన అజిత్ డోవల్!

Ajit Doval: ఒక్క వెంట్రుకతో పాక్ అణు రహస్యాన్ని ఛేదించిన అజిత్ డోవల్!

Ajit Doval Uncover Pakistan’s Nuclear Secrets: ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోవల్ తన గూఢచార జీవితంలో ఎన్నో సాహసోపేతమైన మిషన్లను పూర్తి చేశారు. 1980లలో ఆయన పాకిస్తాన్‌లో ఒక బిచ్చగాడి వేషంలో నివసించి, ఆ దేశపు అణు కార్యక్రమ రహస్యాలను ఎలా బయటపెట్టారో డీ. దేవ్‌దత్ రాసిన ‘అజిత్ డోవల్ – ఆన్ ఏ మిషన్’ అనే పుస్తకంలో వివరంగా ఉంది.

- Advertisement -

ALSO READ: Punjab Floods : పంజాబ్ వరదల్లో ఆర్మీ హీరోయిక్ రెస్క్యూ.. 22 CRPF జవాన్లు, 3 సామాన్యుల ప్రాణాలు కాపాడిన సైనికులు

1974లో భారత్ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత, పాకిస్తాన్ కూడా అణ్వస్త్రాలను సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ దేశం రహస్యంగా అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని భారత్‌కు అనుమానం వచ్చింది. దీనికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు సేకరించే బాధ్యత అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి అజిత్ డోవల్‌కు అప్పగించారు.

ALSO READ: Anil Chauhan : శాంతిని కోరుకుంటాం.. సమరానికీ సిద్ధం! శత్రువులకు సీడీఎస్ చౌహాన్ తీవ్ర హెచ్చరిక

సాధారణ బిచ్చగాడి వేషంలో..

అణు పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని కహుటా ప్రాంతంలో ఉన్న ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ (KRL)లోకి ప్రవేశించడం చాలా కష్టం. ఈ ప్రాంతం అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండేది. ఈ సవాలును స్వీకరించిన అజిత్ డోవల్, ఒక సాధారణ బిచ్చగాడిలా వేషం వేసుకుని ఆ ప్రాంతంలో తిరగడం మొదలుపెట్టారు. చిరిగిన దుస్తులు ధరించి, ఏ దృష్టినీ ఆకర్షించకుండా వీధులు, సందులలో సంచరించేవారు. అనేక నెలల పాటు అక్కడి పరిస్థితులను, శాస్త్రవేత్తల కదలికలను, వారి దినచర్యను గమనించారు.

ALSO READ: Modi : కాంగ్రెస్ చూస్తూ కూర్చుంది… మేం వదిలిపెట్టం… ఉగ్రవాదంపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు!

జుట్టుపై యురేనియం రేణువులు..

ఆయనకు ఒక చిన్న మంగలి షాపులో ఒక కీలకమైన అవకాశం లభించింది. ఆ షాపునకు KRL శాస్త్రవేత్తలు తరచుగా వచ్చేవారు. డోవల్ నేలపై పడి ఉన్న జుట్టు పోగులను జాగ్రత్తగా సేకరించారు. ఆ వెంట్రుకలను భారత్‌కు రహస్యంగా పంపించారు. వాటిని పరిశీలించగా, అందులో రేడియేషన్, యురేనియం రేణువులు ఉన్నట్లు తేలింది. ఈ ఆధారాలు పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని ధృవీకరించాయి.

ఈ కీలక సమాచారం భారత్ తన జాతీయ భద్రతా విధానాలను రూపొందించుకోవడానికి ఎంతో సహాయపడింది. ఈ మిషన్ దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. డోవల్ చేసిన ఈ సాహసం కారణంగా పాకిస్తాన్ అణు పరీక్షలు దాదాపు 15 సంవత్సరాలు ఆలస్యం అయ్యాయని నిపుణులు నమ్ముతున్నారు.

ALSO READ: Narendra Modi : కాంగ్రెస్ పాపం.. దిగుమతుల శాపం: 65 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ నిప్పులు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad