Wednesday, April 30, 2025
Homeనేషనల్Pakistanis: భారత్ వీడిన పాక్ పౌరులు ఎంత మంది అంటే..?

Pakistanis: భారత్ వీడిన పాక్ పౌరులు ఎంత మంది అంటే..?

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ పౌరులు(Pakistanis) ఏప్రిల్ 27 లోపు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. అయితే వైద్య వీసాలు ఉన్న వారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న పాక్ జాతీయులను గుర్తిస్తుండటంతో పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లారు. తాజాగా ఈ గడువు ముగియడంతో పాక్ పౌరులు ఎంతమంది భారత్ వీడారనే విషయాన్ని అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇంకా దేశంలో ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

ఏప్రిల్ 24 నుంచి ఆరు రోజుల్లో 786 మంది పాకిస్తాన్ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా భారత్ విడిచి పాక్‌కు బయలుదేరారని సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో 1,376 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు నేరుగా విమానాలు లేకపోవడంతో చాలా మంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News