Huge holidays for banks in June: కొత్త నెల వస్తోందంటే చాలు బ్యాంకు సెలవులు, కార్యకలాపాలపై అందరూ ఆరా తీస్తుంటారు. ఎందుకంటే, నిత్యం మన జీవితంలో భాగమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్క రోజు ఆగిపోతే అస్థవ్యస్తం అయిపోతుంది. అందుకే, జూన్ నెల సమీపిస్తున్నందున.. సెలవుల జాబితాపై ఓలుక్కేద్దాం. బ్యాంకింగ్ క్యాలెండర్ ప్రకారం, జూన్‌లో ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో ఎక్కువ శాతం సెలవులు కేవలం కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలకే పరిమితం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రతి నెలలోని రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని ఆదివారాల్లో సెలవు ఉంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పండుగల ఆధారంగా మిగిలిన సెలవులు ఉండనున్నాయి. ఆ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా..
జూన్ 7: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 13: రెండో శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 14: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 15 (వైఎంఏ డే / రాజా సంక్రాంతి): మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు.
జూన్ 21: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 25 (మొహర్రం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్యాంకులకు సెలవు.
జూన్ 26 (మొహర్రం/అషూరా): గుజరాత్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, కేరళ, గోవా, ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
జూన్ 27: నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 28: ఆదివారం (దేశవ్యాప్తంగా సెలవు)
జూన్ 29 (సంత్ గురు కబీర్ జయంతి): హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.
జూన్ 30 (రెమ్నా ని పీస్ డే): మిజోరం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
ఆన్‌లైన్ సేవలు యథాతథంగా..
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎంలు, యూపీఐ మనీ ట్రాన్సాక్షన్స్ ఎప్పటిలాగే 24 గంటలూ పనిచేస్తాయి. అయితే, బ్యాంకు శాఖలకు వెళ్లి చేసే నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్లు ఇతర లోన్ సంబంధిత సేవలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోనున్నాయి. దీన్ని గమనించి తమ కస్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి.

