Saturday, February 14, 2026
Homeనేషనల్Budget 2026-27: కేంద్ర బడ్జెట్‌లో వారికి భారీ ఊరట.. తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందులు

Budget 2026-27: కేంద్ర బడ్జెట్‌లో వారికి భారీ ఊరట.. తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందులు

Huge relief in the Union Budget: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27లో క్యాన్సర్ రోగులకు భారీ ఊరట లభించింది. 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. దీని వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి చికిత్స మరింత చౌకగా మారనుంది. సహజంగా క్యాన్సర్ చికిత్సకు వాడే డ్రగ్స్ తరుచుగా విదేశాల నుంచి భారత్‌కు వస్తుంటాయి. దిగుమతి సుంకాలు ఔషధాల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మందులపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించడం ద్వారా రోగులకు మెరుగైన వైద్యం, చికిత్స అందే వీలు కలిగింది. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అరుదైన క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించే మందులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మందులు చాలా వరకు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, సెల్ ఆధారిత చికిత్సల్లో అత్యంత కీలకంగా పనిచేస్తాయి. కాగా, కస్టమ్స్ సుంకం భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నుగా పిలువబడుతుంది. మందులపై ఈ సుంకాలను తొలగించినప్పుడు, అది వాటి ల్యాండింగ్ ధరను నేరుగా తగ్గిస్తుంది. దిగుమతిదారులు లేదా ఆస్పత్రులు ఇకపై వాటికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. రోగులకు తక్కువ ధరకు ఆ మందులు లభించనున్నాయి.

- Advertisement -

ధరలు తగ్గే 17 రకాల మందులు ఇవే..

1. రిబోసిక్లిబ్
2. అబెమాసిక్లిబ్
3. టాలికాబ్టాజీన్ ఆటోల్యూసెల్
4. ట్రెమెలిముమాబ్
5. వెనెటోక్లాక్స్
6. సెరిటినిబ్
7. బ్రిగాటినిబ్
8. డారోలుటామైడ్
9. టోరిపాలిమాబ్
10. సెర్ప్లులిమాబ్
11. టిస్లెలిజుమాబ్
12. ఇనోటుజుమాబ్ ఓజోగామిసిన్
13. పొనాటినిబ్
14. ఇబ్రూటినిబ్
15. డాబ్రాఫెనిబ్
16. ట్రామెటినిబ్
17. ఇపిలిముమాబ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News