Wife Murder in Bihar: వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన బంధాన్ని మంటల్లో తగలబెట్టేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకి కనీసం పది అయినా చోటు చేసుోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బిహార్ రాష్ట్రంలో ప్రియురాలి కోసం భార్యను కడతేర్చాడు ఓ భర్త. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రియురాలితో పెళ్లికి ఒప్పుకోలేదని తన రెండో భార్యకు నిప్పంటించాడు నిప్పంటించాడు భర్త. ఈ దారుణ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది. నలంద జిల్లాకు చెందిన వికాస్ కుమార్‌కు ఐదేళ్ల క్రితం సునీత దేవి(25)తో వివాహం జరిగింది. కాగా, అతనికి అప్పటికే వేరే అమ్మాయితో పెళ్లి అయిందని తెలిసిన సునీత తల్లిదండ్రులు ఖంగు తిన్నారు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే తమ కూతురిని వావాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సునీత తల్లిదండ్రులు వికాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే అతని కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో సునీత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.
కొన్నాళ్ల పాటు వారి కాపురం సాఫీగా సాగగా దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే పుట్టిన వెంటనే ఆ పిల్లలిద్దరూ చనిపోవడంతో సునీతను కుమార్ వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు.
తాను తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని, అందుకు అంగీకరించాలని సునీతను వేధించడంతో అందుకు ఆమెకు ఒప్పుకోలేదు. దీంతో భార్యపై పగ పెంచుకున్న భర్త ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం సునీతను ఓ గదిలో బంధించి పెట్రోల్ పోసి అనంతరం సిలిండర్ లీక్ చేసి నిప్పంటించాడు. పెట్రోల్ పోసి గదిని మూసిన వెంటనే సునీత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. విషయం తెలిపింది.
అప్రమత్తమైన తల్లిదండ్రులు వికాస్ ఇంటికి చేరుకునేలోగా వారి కూతురు ప్రాణాలు మంటల్లో ఆహుతి అయ్యాయి. కాగా ఘటన అనంతరం సునీత కుటుంబ సభ్యులను చూసి వికాస్‌తో పాటు అతని తల్లితండ్రులు పరారయ్యారు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


