Friday, September 20, 2024
Homeనేషనల్Hyd: తెలంగాణ మోడల్ వీడియో స్క్రీన్ ప్రచార రథాలు

Hyd: తెలంగాణ మోడల్ వీడియో స్క్రీన్ ప్రచార రథాలు

మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభలో అధ్బుతమైన తెలంగాణ మోడల్ గురించి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఆదివారం జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార రథాలు మహారాష్ట్రలోని కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల 16 తాలూకాలలో ఉన్న 1600 గ్రామాల్లో తెలంగాణ పథకాల గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేశారు.
బీఆర్ ఎస్ అంటేనే బీసీలు, రైతుల సంక్షేమం అన్న జీవన్ రెడ్డి.. మహారాష్ట్ర కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 16 తాలూకాలలోని 1600 గ్రామాలకు ప్రచార రథాలు పంపి తెలంగాణ మోడల్ గురించి వివరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి, నాగనాథ గీస్వడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News