“I Am Shiva’s Devotee, Will Swallow Poison”: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై, తన దివంగత తల్లిపై వస్తున్న దూషణల పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను శివుడి భక్తుడినని, దూషణలనే విషాన్ని మింగడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అస్సాంలోని దరాంగ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: Exodus from Nepal: నేపాల్ నుంచి స్వదేశానికి.. నాలుగు రోజుల్లో 5 వేల మంది!
“ప్రజలే నా దేవుళ్లు, నా యజమానులు, నా రిమోట్ కంట్రోల్. నా బాధను వారి ముందు కాకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి? నేను ఇలా మాట్లాడితే, మోదీ మళ్లీ ఏడుస్తున్నాడని కాంగ్రెస్ ఎకోసిస్టమ్ మొత్తం నాపై దాడి చేస్తుందని నాకు తెలుసు. కానీ నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు,” అని మోదీ అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్‌ను సోనియా గాంధీ, ఖర్గేను గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తోందని మోదీ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇటీవల బిహార్ ఎన్నికల ప్రచారంలో RJD-కాంగ్రెస్ వేదికపై నుంచి తనను దూషించారని, ఆ తర్వాత కాంగ్రెస్ తన తల్లిపై AI-జనరేటెడ్ వీడియో సృష్టించిందని మోదీ ఆరోపించారు.
ALSO READ: Vijay: ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. బీజేపీ, డీఎంకేలపై విజయ్ విమర్శలు
ఈ సందర్భంగా ప్రధాని, అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు భారతరత్న ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. “భూపేన్ హజారికా లాంటి గొప్ప కళాకారులకు భారతరత్న ఇస్తే, మోదీ గాయకులకు, నృత్యకారులకు అవార్డులు ఇస్తున్నారని ఖర్గే ఎగతాళి చేశారు” అని మోదీ విమర్శించారు.
“పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు మన సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపడితే, కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ చెప్పే అబద్ధాలనే కాంగ్రెస్ తమ ఎజెండాగా మార్చుకుంది. చొరబాటుదారులను ప్రోత్సహించి, వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం” అని ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ: Tejashwi Yadav: అన్ని స్థానాల్లో మేమే పోటీ చేస్తాం.. పొత్తుకు విరుద్ధంగా తేజస్వీ యాదవ్ సంచలన ప్రకటన


