Sunday, July 13, 2025
Homeనేషనల్Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుడ్ న్యూస్..!

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుడ్ న్యూస్..!

కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలోని కొన్ని అకస్మిక మరణాల కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు వయస్సు గల వ్యక్తుల్లో గుండె సంబంధిత సమస్యలు, హఠాత్తుగా జరిగిన మరణాలు వివిధ వర్గాల్లో ఆందోళన కలిగించాయి. ఈ ఘటనలతో పాటు, కొందరు వ్యాక్సిన్‌ వల్లే ఈ మరణాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఎయిమ్స్ (AIIMS) కలిసి నిర్వహించిన సమగ్ర అధ్యయనం ప్రకారం, కోవిడ్ వ్యాక్సిన్లకు ఆ అకస్మిక మరణాల మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేకరించిన డేటాను పరిశీలించి రూపొందించబడింది.

- Advertisement -

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని మరోసారి నిర్ధారించింది. వ్యాక్సిన్ల వలన హృద్రోగాలు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం లేదని, వ్యాక్సినేషన్ పూర్తిగా సురక్షితమని వెల్లడించింది. ఈ పరిశోధనలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గలవారిలో హఠాత్తుగా జరిగిన మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధ్యయన ఫలితాల ప్రకారం, ఈ ఘటనలకు ప్రధాన కారణాలు జీవనశైలి లోపాలు, ఆలస్యంగా గుర్తించబడిన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న వ్యాధులు కావచ్చని తేలింది. ఉదాహరణకు అధిక ఒత్తిడి, అసమతుల్య ఆహారం, సుదీర్ఘమైన పని గంటలు, వ్యాయామం లోపం వంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది.

జాతీయ స్థాయిలో భారత రోగ నియంత్రణ కేంద్రం (NCDC) కూడా ఈ అధ్యయనంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఉన్నత స్థాయి పరిశోధకులు, కార్డియాలజీ నిపుణులు ఈ విశ్లేషణకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, కోవిడ్ వ్యాక్సిన్‌లు హృదయ సంబంధిత హఠాత్తు మరణాలకు కారణమయ్యాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. సమాజంలో వ్యాపిస్తున్న అపోహలు బలయ్యే ముందు, ప్రజలు పరిశోధనలపై ఆధారపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే యువత ఆరోగ్యానికి మేలని వారు సలహా ఇస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News