IIT Madras Professor Among TIME’s 100 AI: ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ ‘ఏఐ రంగంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో భారతీయ విద్యావేత్త ఒకరు స్థానం సంపాదించారు. ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన మిథేష్ ఖప్రా, ప్రపంచ దిగ్గజాలైన ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ వంటి వారితో కలిసి ఈ జాబితాలో నిలిచారు. భారతీయ భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధనలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.
ALSO READ: AI: వృద్ధాప్యానికి చెక్.. వయసు తగ్గించే AIని సృష్టించిన శాస్త్రవేత్తలు..
ఏఐకి భారతీయ స్పర్శ
మిథేష్ ఖప్రా “ఏఐ4భారత్” అనే కార్యక్రమాన్ని సహ-స్థాపించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన బృందం భారతీయ భాషల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఓపెన్-సోర్స్ టూల్స్, డేటాసెట్‌లను రూపొందించారు. వందలాది భారతీయ భాషలు ఉన్నప్పటికీ, వాటిలో చాలావరకు ఏఐ అభివృద్ధికి సరైన డేటా అందుబాటులో లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఖప్రా బృందం దేశంలోని దాదాపు 500 జిల్లాల్లో పర్యటించి, వేలాది గంటల ఆడియో, టెక్ట్స్ డేటాను సేకరించింది. ఈ డేటాసెట్‌లు ఇప్పుడు భారత్‌లో అనేక స్టార్టప్‌లు, ప్రభుత్వ ప్రాజెక్టులకు, చివరికి ప్రపంచ టెక్ దిగ్గజాల సంస్థలకు సైతం మార్గదర్శకంగా మారాయి.
ALSO READ: RIL AGM : జియో ఫ్రేమ్స్, జియో పీసీ, హాట్‌స్టార్‌లో కొత్త ఏఐ ఫీచర్లు
భవిష్యత్తుకు మార్గదర్శనం
టైమ్ మ్యాగజైన్ పేర్కొన్న ప్రకారం, భారతదేశంలోని వాయిస్ టెక్నాలజీ స్టార్టప్‌లు దాదాపుగా అన్నీ ఖప్రా డేటాసెట్‌లపై ఆధారపడుతున్నాయి. ఆయన పరిశోధనలు భారత ప్రభుత్వ ‘భాషిణి’ మిషన్‌కు ప్రధాన మూలస్తంభంగా నిలిచాయి. గతంలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంగ్లీష్ భాషపైనే దృష్టి పెట్టేవారని, కానీ ఇప్పుడు తమ డేటాసెట్‌ల వల్ల భారతీయ భాషల్లోని ఏఐ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తి చూపిస్తున్నారని మిథేష్ ఖప్రా అన్నారు.
ALSO READ: IIT Guwahati: పది సెకన్లలోనే కాలుష్య కారకాలను గుర్తించొచ్చా?
అంతర్జాతీయ గుర్తింపు
టైమ్ 100 ఏఐ జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా, మిథేష్ ఖప్రా కేవలం ఒక ప్రొఫెసర్‌గా మాత్రమే కాకుండా, భారత సాంకేతిక భవిష్యత్తును రూపుదిద్దుతున్న కీలక వ్యక్తిగా ప్రపంచ గుర్తింపు పొందారు.
ALSO READ: ChatGPT : చాట్‌జీపీటీ సేవలు ఆగిపోయాయా!


