Katihar: బీహార్ లోని కటిహార్ జిల్లా ఫల్కా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక షాక్ కలిగించే సంఘటన చోటుచేసుకుంది. న్యాయ స్థానాలు, పోలీస్ స్టేషన్ లు ఉన్న ఈ కాలంలో గ్రామస్థులు గ్రామం నడిబొడ్డున పంచాయతీ పెట్టి, నిందితులను శిక్షించారు. అక్రమ సంబంధంతో పట్టుబడిన నిందితులను తమదైన శైలిలో గ్రామస్తులు శిక్షించారు.
ఫల్కా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహిత (32), తన ప్రియుడి (40)తో సన్నిహితంగా ఉండగా గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఆదేశాలతో వారి పట్ల అపహాస్యకరంగా ప్రవర్తించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరినీ విద్యుత్ స్తంభానికి కట్టివేయడం జరిగింది. తరువాత ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్ల రంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
Read more: https://teluguprabha.net/national-news/india-condemns-trump-tariffs-russia-oil/
వీడియో చూసిన ప్రియుడి భార్య వెంటనే ఫల్కా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తకు రక్షణ కల్పించాలని వేడుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ శిఖర్ చౌధరి మాట్లాడుతూ, “ఇద్దరూ వివాహితులే. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నాం. పూర్తి దర్యాప్తు అనంతరం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
Read more: https://teluguprabha.net/national-news/dharali-flood-cause-glacial-deposit-collapse/
ఈ సంఘటన బీహార్‌లో గ్రామస్థాయి న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ప్రశ్నలు రేపుతోంది. న్యాయాన్ని కోర్టులు కాకుండా పంచాయతీలు తన శైలిలో తీర్పులు ఇవ్వడం, మానవ హక్కులు, గౌరవం వంటి విలువలకు విఘాతం కలిగించడమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


