పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్(India), పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణం యుద్ధం జరుగుతుందోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్‌ను దెబ్బతీసేందుకు భారత్ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతోపాటు తదితర కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి వచ్చే దిగుమతులపై(Imports) నిషేదించింది. జాతీయ భద్రత, ప్రజా విధానాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇరు దేశాల మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా -అట్టారి సరిహద్దు ఇప్పటికే మూసివేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నుంచి ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజలు భారత్‌కి దిగుమతి అవుతాయి. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ దిగుమతులపై 200% టారిఫ్ విధించింది. ఆ తర్వాత టారిఫ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. దీంతో కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటిపై కూడా నిషేధం విధించింది.