Thursday, December 11, 2025
HomeTop StoriesGDP Q2: రెండో త్రైమాసికంలో భారీగా భారత్ జీడీపీ.. ప్రభావం చూపని అమెరికా సుంకాలు 

GDP Q2: రెండో త్రైమాసికంలో భారీగా భారత్ జీడీపీ.. ప్రభావం చూపని అమెరికా సుంకాలు 

India GDP 2025- 26 Q2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025- 26 రెండో త్రైమాసికంలో భారత్‌ జీడీపీ గణనీయమైన వృద్ధిని సాధించింది. Q2లో 8.2 శాతం జీడీపీ నమోదు చేయడంతో.. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని నమోదు చేయగా.. గతేడాది ఇదే కాలానికి 5.6 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాదిలో భారత్‌పై అమెరికా సుంకాల పెంపు చేపట్టినా.. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-inaugurates-ram-statue-goa-jeevottam-math/

గ్రామీణ స్థాయిలో వినియోగం పెరగడం, ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల జీడీపీ వృద్ధికి దోహదపడ్డాయి. కాగా, ప్రైవేట్‌ మూలధన వ్యయం అంతంతమాత్రంగానే ఉన్నా.. ఆశించిన స్థాయిలో జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. కాగా, సెప్టెంబర్‌ 22 నుంచి కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇక పండుగ సీజన్‌ కావడంతో కొనుగోళ్లు పెరిగి దేశ ఆర్థిక వృద్ధికి ఊతం లభించిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, రెండో త్రైమాసికం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉండగా.. Q2పై జీఎస్టీ రేట్ల ప్రభావం అంతగా కనిపించలేదు. అయినా మెరుగైన జీడీపీ నమోదైంది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-dum-biryani-stood-the-worlds-top-ten-dishes/

ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు ఎదురైనప్పటికీ.. వినియోగదారుల వ్యయం, తయారీ రంగం.. జీడీపీ వృద్ధి రేటులో కీలక పాత్ర పోషించాయి. ఇక వ్యవసాయం సహా కీలక రంగాల్లో పన్నులు తగ్గించడం కూడా కలిసొచ్చింది. భారత్‌ జీడీపీలో 14శాతం వాటా కలిగిన తయారీ రంగం.. ఈ త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఈ వృద్ధి రేటు 2.2 శాతంగా ఉంది. ఇక, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా.. 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే.. మరో 22 ఏళ్ల పాటు భారత్‌ సగటున 7.8 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News