Saturday, November 15, 2025
Homeనేషనల్PM Modi: త్వరలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ..!

PM Modi: త్వరలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ..!

PM Modi China Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వరుస విదేశీ పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే త్వరలోనే మోదీ చేపట్టబోయే విదేశీ పర్యటన గురించి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకుంటే భారత్‌కు శత్రుదేశంగా భావించే పాకిస్తాన్‌కు అన్ని విషయాల్లో అండదండలు అందిస్తున్న దేశంలో పర్యటిస్తారనే సమాచారం. ఆసియా దేశాల్లోనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన చైనా దేశంలో ప్రధాని మోదీ త్వరలోనే పర్యటించనున్నారని తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు కూడా జరపనున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధించే కార్యక్రమంలో భాగంగా మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

గతంలో లఢఖ్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆసియా ఖండంలోనే బలమైన రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం చర్చనీయాంశమైంది. దీంతో ప్రపంచంలో ఆసియా దేశాలు బలహీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దౌత్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాల అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చైనా అధికారులతో సమావేశమయ్యారు. అలాగే ఇటీవల భారత విదేశాంగా మంత్రి జైశంకర్ జిన్‌పింగ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ కూడా చైనాతో సంబంధాలు మెరుగుపర్చేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Also Read: రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. 12 మంది మృతి

ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్‌ వేదికగా జరగనున్న షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ హైలెవల్‌ మీటింగ్‌కు ప్రధాని మోదీ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా ఇతర దేశాధినేతలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాగా గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో మోదీ, జిన్‌పింగ్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. 2015లో తొలిసారిగా ప్రధాని హోదాలో మోదీ బీజింగ్‌కు వెళ్లారు. ఇప్పటివరకు ఐదు సార్లు చైనాలో పర్యటించారు. చివరిసారి 2020లో అక్కడికి వెళ్లారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad