Saturday, November 15, 2025
Homeనేషనల్Cancer cases India: వణికిస్తోన్న క్యాన్సర్ మహమ్మారి.. 2024లో 15 లక్షలకు పైగా కేసులు

Cancer cases India: వణికిస్తోన్న క్యాన్సర్ మహమ్మారి.. 2024లో 15 లక్షలకు పైగా కేసులు

India Recorded Over 15 Lakh Cancer Cases in 2024: భారతదేశంలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 2024 సంవత్సరంలో దేశంలో 15 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ లోక్‌సభలో వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదిక ఆధారంగా ఈ వివరాలను మంత్రి తెలిపారు.

- Advertisement -

అవగాహనే కారణం?

గడచిన కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2019లో 13.5 లక్షల కేసులు ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 15.3 లక్షలకు చేరింది. అంతేకాకుండా, 2023లో క్యాన్సర్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8.2 లక్షలకు చేరుకుందని నివేదిక పేర్కొంది. ఈ పెరుగుదలకు అనేక కారణాలను మంత్రి వివరించారు. మెరుగైన రోగ నిర్ధారణ పద్ధతులు, పెరిగిన సగటు ఆయుర్దాయం, వృద్ధుల జనాభాలో పెరుగుదల, ఆరోగ్యంపై అవగాహన పెరగడం వంటివి ఈ కేసుల నమోదుకు, పెరుగుదలకు ప్రధాన కారణాలని ఆయన అన్నారు.

మద్యం, పొగాకు వినియోగం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి జీవనశైలి కారకాలు కూడా క్యాన్సర్ కేసులు పెరగడానికి దారితీస్తున్నాయని ఆయన తెలిపారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NP-NCD)’ని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా క్యాన్సర్ నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్సపై దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad