Wednesday, January 14, 2026
Homeనేషనల్India-US trade : "మోదీ ఫోన్ చేయలేదన్నది అవాస్తవం!"

India-US trade : “మోదీ ఫోన్ చేయలేదన్నది అవాస్తవం!”

India-US trade deal friction : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎందుకు కుదరలేదో చెబుతూ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ చేసిన వ్యాఖ్యలు, ఇరు దేశాల మధ్య కొత్తగా దౌత్యపరమైన దుమారాన్ని రేపాయి. “ఒప్పందం ఖరారైన సమయంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడం వల్లే డీల్ ఆగిపోయింది” అని ఆయన చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా “అవాస్తవం” అని, నిరాధారమైనవని తేల్చి చెప్పింది. అసలు అమెరికా మంత్రి ఎందుకీ వ్యాఖ్యలు చేశారు..? దీనిపై భారత్ ఇంత ఘాటుగా ఎందుకు స్పందించింది..?

- Advertisement -

ఇటీవల, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్, భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విఫలమవ్వడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్షంగా నిందలు మోపారు. ఒప్పందం ఖరారయ్యే కీలక సమయంలో, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేయాల్సి ఉండగా, చేయలేదని, అందుకే ఒప్పందం ముందుకు సాగలేదని ఆయన పేర్కొన్నారు.

భారత్ ఘాటు స్పందన.. లెక్కలతో సహా : లట్నిక్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు.
అమెరికా వాణిజ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం .ఈ ఒక్క ఏడాదిలోనే (2025లో), ఇరు దేశాల అధినేతలు (మోదీ, ట్రంప్) ఎనిమిది సార్లు మాట్లాడుకున్నారు.”
– విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

కేవలం ఒక్క ఫోన్ కాల్ కారణంగా ఇంత పెద్ద వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందనడం  హాస్యాస్పదం అని, ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని భారత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

మరోవైపు 500% సుంకాల గండం : ఈ ఫోన్ కాల్ వివాదం ఒకవైపు ఉండగానే, మరోవైపు అమెరికా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. రష్యాపై అమెరికా విధించతలపెట్టిన ఆంక్షల బిల్లులో, రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై ఏకంగా 500% వరకు సుంకాలు విధించే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా విదేశాంగ శాఖ స్పందించింది.

ఈ బిల్లు ఆమోదం పొందితే, రష్యాతో బలమైన వాణిజ్య, రక్షణ సంబంధాలున్న భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వరుస పరిణామాలు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఎంత సున్నితమైన దశలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆరోపణలు, సుంకాల రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News