Sunday, May 4, 2025
Homeనేషనల్India-Pakistan: పాక్‌పై భారత్‌ మరిన్ని కఠిన చర్యలు

India-Pakistan: పాక్‌పై భారత్‌ మరిన్ని కఠిన చర్యలు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై(India-Pakistan) కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దౌత్య, వాణిజ్య పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాటు ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే అన్ని ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

మరోవైపు పాకిస్థాన్‌తో సముద్ర రవాణా మార్గాలను కూడా మూసివేసింది. పాక్ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్‌ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇక పాకిస్థాన్‌ విమానాలకు భారత్ గగనతలాన్ని మూసివేసిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News