Saturday, November 15, 2025
Homeనేషనల్US Postal Services Halted: అమెరికాకు పార్సెల్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇకపై కష్టమే..!

US Postal Services Halted: అమెరికాకు పార్సెల్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇకపై కష్టమే..!

US Postal Services Halted: మీరు అమెరికాకు ఇండియన్ పోస్టల్ ద్వారా ఏదైనా పార్సెల్ లేదా లెటర్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ వార్త మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియల్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఎందుకు, ఎప్పటి నుంచనే చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ అమెరికాకు తన సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెం. 14324 నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ ప్రకారం ప్రకారం ఆగస్టు 29 నుంచి 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు ఇచ్చే కస్టమ్స్ పన్నుల మినహాయింపు రద్దు చేసింది. దీంతో అమెరికాకు పంపే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు, విలువతో సంబంధం లేకుండా, IEEPA టారిఫ్ ప్రకారం కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిందే. అయితే 100 డాలర్ల వరకు విలువైన బహుమతి వస్తువులపై మాత్రం సుంకాలు ఉండవు.

- Advertisement -

Read Also: US Open 2025: యూఎస్ ఓపెన్ జూనియర్స్.. ‘మాయా’జాలం చూపిస్తుందా?

కొత్త రూల్ వల్ల..

ఈ కొత్త రూల్ వలన భారత పోస్టల్ శాఖ 100 డాలర్ల వరకు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను మినహాయించి, అన్ని పోస్టల్ సేవలను నిలిపివేస్తోంది. అమెరికా కొత్త కస్టమ్స్ విధానం వల్ల ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా అమెరికాకు పార్సెల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నిర్ణయం ఈ-కామర్స్ సంస్థల ద్వారా అమెరికాకు జరిగే లో-వాల్యూ షిప్‌మెంట్లపై గణనీయమైన ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: S Jaishankar: భారత్- పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం.. జైశంకర్ స్ట్రాంగ్ రిప్లయ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad