Saturday, November 15, 2025
HomeTop StoriesUS Flight Tickets: రూ.కోటి ఉంటేనే కోరుకున్న అమెరికా జాబ్.. రూ.3 లక్షలు దాటిన అమెరికా...

US Flight Tickets: రూ.కోటి ఉంటేనే కోరుకున్న అమెరికా జాబ్.. రూ.3 లక్షలు దాటిన అమెరికా ఫ్లైట్ టికెట్స్..

H1B Visa Fears: 2025 సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి రాబోతున్న అమెరికా H-1B వీసా నిబంధనలు భారతీయులను భారీగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా H-1B వీసా కోసం కంపెనీలు ప్రతి సంవత్సరం 1 లక్ష డాలర్ల (ప్రత్యక్షంగా 88 లక్షల రూపాయలు) ఫీజు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించారు. దీంతో ప్రవాస భారతీయ H-1B వీసాదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయులు ఈ కేటగిరీ వీసాల్లో 70% కి పైగా భాగస్వామ్యం కలిగి ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -

అమెరికా నుంచి వెకేషన్ లేదా ఏదానా పనిమీద ఇండియాకు వచ్చిన అలాగే వస్తూ దారిలో ఉన్న భారతీయులు వార్త విన్న వెంటనే అమెరికాకు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి టెక్ దిగ్గజాలు తక్షణమే వెనక్కి వచ్చేయాలంటూ తమ ఉద్యోగులకు హెచ్చరికలు ఇచ్చాయి. విదేశాల్లో ఉన్న వీసాదార్లు అమెరికాకు తిరిగి చేరుకోకపోతే వారు అమెరికాలో ప్రవేశించలేరు. ఇది చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో విమాన టికెట్ డిమాండ్ పదిగుణం పెరిగింది. ముఖ్యంగా ఇండియా నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే విమాన పయనాలపై టికెట్ ధరలు గమనించదగ్గ విధంగా ట్రిపుల్ అయ్యాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి న్యూయార్క్ కి ఒకవైపు టికెట్ ధర 4వేల 500 డాలర్లు పలుకుతోంది. ఇది దాదాపు రూ.4 లక్షలకు సమానం.

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటివీ ముఖ్య విమానాశ్రయాల నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే విమానాల్లో టికెట్లపై ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. చాలా మంది విమాన ప్రయాణికులు ట్రావెల్ అనిశ్చితి కారణంగా గందరగోళంలో ఉన్నారు. కొన్ని ప్రయాణికులు మధ్యలో విమానాలు మారుస్తూ వెళుతున్నారు. కొందరు మాత్రం ప్రయాణం మధ్యలో విమానం నుండి దిగిపోవటం వంటి దృశ్యాలు కూడా వెల్లడి అయ్యాయి.

ప్రస్తుతం H-1B విధానంపై ఉన్న ఈ కఠినత కారణంగా.. భారతీయ ప్రవాసులకు అమెరికాకు తిరిగి వెళ్లేందుకు భారీ ఆర్థిక భారతంతో పాటు ప్రయాణ సంక్లిష్టతలు ఏర్పడుతున్నాయి. నాలుగు రోజులు ఇంట్లో వాళ్లను చూద్దామని వచ్చిన వారు ప్రస్తుతం ట్రంప్ కొత్త రూల్స్ అమలులోకి వస్తే లక్ష డాలర్లు ఎక్కడి నుంచి తీసుకురాగలం అంటూ ఆవేదన చెందుతూ వీలైనంత త్వరగా అమెరికాలోని ఏదో ఒక ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు ఉన్న విమానాలను వెతుక్కుంటున్నారు. నేరుగా దొరికినా లేక కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరికినా అస్సలు వదలటం లేదు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad