HomeTop StoriesSecurity : సముద్ర గర్భంలో భారత్-అమెరికా టెక్ వ్యూహం: గ్లోబల్ కేబుల్ హబ్‌గా ఇండియా

Security : సముద్ర గర్భంలో భారత్-అమెరికా టెక్ వ్యూహం: గ్లోబల్ కేబుల్ హబ్‌గా ఇండియా

India US undersea cable security : స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో ఖండాంతర సమాచారాన్ని క్షణాల్లో పొందుతున్నాం. కానీ ఈ అనంత డేటా ప్రయాణించేది అంతరిక్షంలో కాదని, అగాధ సముద్రాల అడుగున పరుచుకున్న సన్నని కేబుళ్ల ద్వారానేనని మీకు తెలుసా? ప్రపంచ డిజిటల్ వాణిజ్యానికి ప్రాణవాయువు లాంటి ఈ అండర్‌సీ కేబుల్స్‌పై భౌగోళిక-రాజకీయ అలజడుల నీడలు కమ్ముకుంటున్న వేళ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు భారత్, అమెరికాలు సముద్రగర్భంలో ఉమ్మడి రక్షణ కవచాన్ని ఎందుకు నిర్మిస్తున్నాయి? ఈ సరికొత్త ‘టెక్ వ్యూహం’ వెనుక దాగిన ఆంతర్యమేమిటి?

- Advertisement -

డిజిటల్ వెన్నెముకకు పటిష్ట రక్షణ : ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతానికి పైగా డేటా సముద్రపు కేబుళ్ల ద్వారానే రవాణా అవుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న తరుణంలో ఈ నెట్‌వర్క్ భద్రత, వైవిధ్యీకరణ ప్రధాన అజెండాగా ఇరు దేశాల నిపుణులతో ప్రత్యేక ‘అండర్‌సీ కేబుల్స్ వర్క్‌షాప్’ నిర్వహించినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

‘ట్రస్ట్’తో సరికొత్త సాంకేతిక బంధం : ఈ వ్యూహాత్మక కార్యాచరణ అంతా ఇరు దేశాల ‘ట్రస్ట్’ (TRUST – Transforming the Relationship Utilising Strategic Technologies) చొరవలో భాగంగా ఊపందుకుంటోంది. కీలక రంగాల్లో భరోసాతో కూడిన భాగస్వామ్యాల విస్తరణకు అమెరికా ప్రాధాన్యమిస్తోందని, భారత్ అందులో అత్యంత విశ్వసనీయ మిత్రుడని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.

గ్లోబల్ డేటా హబ్‌గా భారత్ : ఆసియా, యూరప్, ఆఫ్రికా మార్కెట్లను కలిపే వ్యూహాత్మక భౌగోళిక స్థానంలో ఉన్న భారత్.. వేగంగా విస్తరిస్తున్న తన డేటా సెంటర్లు, AI మౌలిక వసతుల దన్నుతో అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతోంది. అంతేగాక, సురక్షిత సరఫరా వ్యవస్థల లక్ష్యంగా అమెరికా సారథ్యంలో ఏర్పాటైన ‘ప్యాక్స్ సిలికా’ (Pax Silica) చొరవలోనూ భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. సముద్రగర్భ కేబుళ్ల రక్షణ మొదలు నెక్స్ట్-జెన్ AI డేటా సెంటర్ల నిర్మాణం వరకు భారత్-అమెరికా భాగస్వామ్యం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News