Wednesday, May 7, 2025
Homeనేషనల్భారత్ ప్రతీకార దెబ్బ.. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద స్థావరాల నాశనం..!

భారత్ ప్రతీకార దెబ్బ.. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద స్థావరాల నాశనం..!

భారత్ మాతాకి జై… పహల్గాం ఉగ్రదాడికి గట్టి బదులు చెప్పింది భారత్. మృదువుగా కనిపించినా, శత్రుదాడులు, ఉగ్రదాలపై ఎలా స్పందిస్తామో చేసి చూపించింది. ఉగ్రదాడులకు ధీటైన ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందన్నది మరోసారి రుజువైంది. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత వైఖరికి నిదర్శనంగా ఆపరేషన్ సింధూర్ పేరిట అర్థరాత్రి భారత్ మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్‌లోని, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాది స్థావరాలను భారత వైమానిక దళాలు విజయవంతంగా ఛేదించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి పాక్ పాలిత ఉగ్ర సంస్థల శిబిరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల అనంతరం ఆ ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

- Advertisement -

భారత రక్షణ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ… “జస్టిస్ ఈజ్ సర్వ్డ్.. జై హింద్” అంటూ భారత్ ఆర్మీ పోస్ట్ చేసింది. ఈ దాడుల్లో పీఓకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్ వంటి ప్రదేశాలపై లక్ష్యంగా దాడులు చేసినట్టు పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది. అయితే వెంటనే భారత్‌పై దుష్ప్రచారానికి తెరదీసింది. మిస్సైల్ దాడుల్లో పౌరులు చనిపోయారంటూ ఆరోపణలు చేసింది.

కానీ భారత రక్షణ శాఖ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. తాము ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నాం. పాక్ ఆర్మీ లేదా పౌరులపై దాడి చేయలేదు. ఎలాంటి నిషేధిత చర్యలు చేయలేదు. లక్ష్యాల ఎంపికలో అత్యంత సంయమనం పాటించాం అని స్పష్టం చేసింది.

ఈ ఆపరేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రతి నిమిషం అప్‌డేట్లు తీసుకుంటూ పర్యవేక్షించినట్టు సమాచారం. రాత్రంతా ఆపరేషన్ విజయవంతంగా జరిగేందుకు ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా గమనించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఈ రోజు మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ చర్యతో భారత్ మరోసారి ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.. దేశంపై దాడి చేసిన వారెవరు అయినా తప్పించుకోలేరు.. భారత్ భద్రత విషయంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందన్న సందేశాన్ని గట్టిగా చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News