పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ(Indian Army).. తాజాగా ఏడీ గన్నర్‌పై రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను ప్రజలతో పంచుకుంది. “నేను ఏడీ గన్.. శత్రువు కనిపిస్తే లేపేస్తా” ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఆపరేషన్ సిందూర్‌లో ఈ గన్ అసాధారణ సామర్థ్యాన్ని కనపడింది.
అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు ఎలా నిర్వహించిందో తెలిపేలా దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. వైమానిక దాడుల దృశ్యాలు, కూలిపోయిన పాకిస్థానీ డ్రోన్‌లను ఆర్మీ సిబ్బంది సేకరించడం, దాడి సమయంలో సైన్యం అప్రమత్తత తదితర విషయాలను వివరిస్తూ వీడియోలో పొందుపరిచారు. శత్రువులను బూడిద చేసే వరకు తాము విశ్రమించమని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భారత సైనికుల త్యాగాలను నెటిజన్లు కొనియాడుతున్నారు.