Ahmedabad: భారతదేశ రైల్వే చరిత్రలో మైలురాయిగా అహ్మదాబాద్–ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిలువబోతుంది. దేశపు తొలి అత్యంత వేగవంతమైన రైల్ కారిడార్ గా ఈ నిర్మాణం జరుగుతుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్ట్ పురోగతిపై ముఖ్య సమాచారం అందించారు.
ఈ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 508 కిలోమీటర్లు ఉంది. దీనికి సంబంధించిన స్టేషన్ లు గుజరాత్ లో 8, మహారాష్ట్రలో 4 కేటాయించారు. గంటకు 320 నుండి 350 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1.08 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2027 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి పట్టాలెక్కించేలా చర్యలు చేపడుతున్నారు.
Read more: https://teluguprabha.net/national-news/threat-alert-to-indian-airports/
పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం 2026లో ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో దీనికి సంబంధించి అండర్ సీ టన్నెల్ పనులు పురోగతిలో ఉన్నాయని, 360 కిమీ పైర్స్, 300 కిమీ వాయడక్ట్, 329 కిమీ గిర్డర్లు పూర్తి అయ్యాయని తెలిపారు. డిసెంబర్ 2027 లోగా వాపి-సబర్మతి సెక్షన్ ని పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నారు. 2029 వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.
Read more: https://teluguprabha.net/national-news/kharge-questions-rajya-sabha-chair-amit-shah/
ఈ బుల్లెట్ ట్రైన్ తో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని 2-3 గంటలకు తగ్గిస్తుంది. అంటే అహ్మదాబాద్ నుండి ముంబయికి 2-3 గంటల్లో చేరుకోవచ్చు. ఈ హై-స్పీడ్ రైలు సేవలతో ప్రజల జీవన శైలి, ప్రాంతీయ అభివృద్ధి గణనీయంగా మారనుంది.


