Restaurant Controversy: దేశ రాజధాని ఢిల్లీలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ఒక రెస్టారెంట్ యాజమాన్యం ఒక జంటని లోపలికి అనుమతించలేదు. ఆ జంట దేశ వస్త్రాధారణలో ఉన్నారని, దేశీయ వస్త్రధారణలో ఉన్నవారికి అనుమతి లేదని వారిని నిరాకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఒక మహిళ తన భర్తతో కలిసి చురిదార్ మరియు కుర్తా వంటి సంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి రెస్టారెంట్‌కు వెళ్ళింది. అయితే, అక్కడ సిబ్బంది వారు చెప్పిన మాటల ప్రకారం, ఇలాంటి దుస్తులు ధరించి ఉన్నవారికి లోపలికి ప్రవేశం లేదు అంటూ వారికి ప్రవేశాన్ని నిరాకరించారు. దీనికి సంబంధించి మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు రెస్టారెంట్ ని సీజ్ చేయాలని కోరారు. మనం మన దేశంలో ఉన్నామా లేక ఇంకా ఎక్కడైనా ఉన్నామా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహించారు. ఈ ఘటనతో భారతీయ సంస్కృతిపై అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని మంత్రి కపిల్ మిశ్రా ఎక్స్ వేదికగా తెలిపారు. ఢిల్లీలో భారతీయ దుస్తులను ధరించినందుకు ప్రవేశాన్ని నిరాకరించడం అసహ్యకరమైన విషయం అని సీఎం అన్నారు. ఇకపై ఏ రెస్టారెంట్ లో కూడా యజమానులు కస్టమర్ లకి ఎటువంటి షరతులు విధించకూడదు అని తెలిపారు.
ఇదిలా ఉండగా మరో వైపు ఈ వివాదం నేపథ్యంలో, సదరు రెస్టారెంట్ యాజమాని స్పష్టీకరణ ఇచ్చారు. మేము ఎప్పుడూ దుస్తుల ఆధారంగా ఎవరినీ తిప్పికొట్టం. ఆ సమయంలో రెస్టారెంట్ పూర్తిగా బుక్ అయింది. అందువల్లనే లోపలికి అనుమతించలేకపోయాం అని వారు పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తాము రక్షాబంధన్ సందర్భంగా భారతీయ వస్త్రధారణలో ఉన్న మహిళలకు ప్రత్యేక రాయితీ అందించనున్నట్టు ప్రకటించారు.


