Commemorative Coins and Stamps 100 Years of RSS: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ వందేళ్ల సేవ, ఐక్యత, అంకితభావానికి గుర్తుగా ప్రత్యేక స్మారక నాణేలు, పోస్టల్ స్టాంపులను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది.
ALSO READ: Amit Shah: చొరబాట్ల వల్లే ముస్లిం జనాభా అసాధారణ వృద్ధి: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
ఈ ప్రత్యేక నాణేలను కోల్‌కతా మింట్ అధికారిక వెబ్‌సైట్ (indiagovtmint.in) ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక స్మారక స్టాంపులు దేశవ్యాప్తంగా ఉన్న ఫిలాటెలీ బ్యూరోలలో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
ALSO READ: Karur Stampede: కరూర్ తొక్కిసలాట బాధితులను ప్రత్యేక వేదికలో కలవనున్న విజయ్.. ఎప్పుడంటే.?
అంతకుముందు, అక్టోబర్ 1న జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నాణేలు, స్టాంపులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో RSS పోషించిన పాత్రను కొనియాడారు. “వంద సంవత్సరాల క్రితం విజయదశమి పర్వదినాన RSS స్థాపించడం యాదృచ్ఛికం కాదు. చెడుపై మంచి, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ఆ రోజు ప్రతీక,” అని ఆయన అన్నారు. గడిచిన శతాబ్ద కాలంలో RSS దేశ నిర్మాణమనే మహోన్నత లక్ష్యంతో పని చేసిందని, ఎందరో కార్యకర్తల జీవితాలను తీర్చిదిద్దిందని ప్రశంసించారు.
1925లో నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చేత స్థాపించబడిన RSS, పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సేవా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైంది.
ALSO READ: IPS Officer’s Suicide : ఐపీఎస్ ఆత్మహత్య.. కుటుంబం అంగీకారం లేకుండానే బలవంతంగా పోస్టుమార్టం?


