ఇండియన్ ఐడల్-12 సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్(Pawandeep Rajan)కు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తొమ్మిదవ జాతీయ రహదాదిరిపై తన కారుతో ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు కావడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పవన్ దీప్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మూడేళ్ల క్రితం జరిగిన ఇండియన్ ఐడల్-12 విన్నర్‌గా పవన్ నిలిచాడు.