దివ్యాంగులకు భారతీయ రైల్వేశాఖ చెప్పిన ఈ శుభవార్తతో వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ కష్టాలను రైల్వే శాఖ తీర్చనుండటంతో రైల్వేశాఖాధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
దివ్యాంగులకు భారత రైల్వే తీపి కబురు అందించింది. ఇకపై రైల్వేపాసు(Railway Pass)ల కోసం రైల్వే కార్యాలయాలు, స్టేషన్లు చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే పోందే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ వెబ్సైట్(Website) ప్రారంభించింది.
దివ్యాంగులు( Disabled People),ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం రాయితీపై ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. రైళ్లు(Rail), బస్సుల్లో వారికి ప్రత్యేక సీట్లు కేటాయింపుతో పాటు ఛార్జీల్లోనూ రాయితీ ఇస్తోంది.
ఆన్లైన్(Online)లోనే పాసు పొందడానికి రైల్వేశాఖ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించింది. అందులోనే ఈ- టికెట్లు బుక్ చేసుకునే విధానాన్నికూడా తీసుకొచ్చారు. దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా పాసులు పొందవచ్చు. http:///divyangjanid.indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్లి పాసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.