Saturday, November 15, 2025
Homeనేషనల్Viral: అమెరికాలో భారతదేశ పరువు తీసిన యువతి.. అసలేం జరిగిందంటే?

Viral: అమెరికాలో భారతదేశ పరువు తీసిన యువతి.. అసలేం జరిగిందంటే?

Indian Women arrested in America: ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లిన భారతీయ మహిళ అక్కడి చట్టాలను ఉల్లంఘించే పనిలో పట్టుబడి, న్యూస్‌లోకి ఎక్కింది. ఈ సంఘటన అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న టార్గెట్ స్టోర్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ మహిళ టూరిస్టుగా అమెరికా వచ్చినట్లు గుర్తించగా, ఆమె అదే స్టోర్‌లో సుమారు 7 గంటల పాటు తిరుగుతూ, వివిధ వస్తువులను ఎంచుకుంటూ, చివరికి బిల్లుల చెల్లింపు లేకుండానే బయటకు వెళ్లేందుకు యత్నించింది. దీనిని గమనించిన స్టోర్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

దాదాపు 1300 డాలర్ల వస్తువుల దొంగతనం?

అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆమె తీసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారుగా 1300 అమెరికన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులోకి వచ్చాక, ఆ మహిళ అవసరమైతే డబ్బులు చెల్లిస్తానని, తనపై కేసు పెట్టొద్దని వేడుకుంది. అయితే ఒక మహిళా పోలీస్ అధికారి ఆమెను ప్రశ్నిస్తూ, “ఇలా భారతదేశంలోనూ చెయ్యడం సాధారణమేనా? డబ్బు ఇచ్చేసరికి చట్టాల్ని పక్కనపెట్టాలా?” అంటూ గట్టిగా ప్రశ్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. “విదేశీ గడ్డపై ఇలాంటి పనులు చేస్తే దేశం పరువు పోతుంది”, “చట్టాలను గౌరవించని వ్యక్తులకు ఇది గుణపాఠం కావాలి”, అంటూ స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళపై ఇంకా అధికారికంగా కేసు నమోదు కాలేదు. అయితే విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. అమెరికా వంటి దేశాల్లో చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ ఘటన ఒక హెచ్చరికలాంటిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా పలు దేశాలు ఇటీవల తమ తమ నిబంధలను కఠినతరం చేస్తున్నాయి. దొంగతనం చేస్తూ పట్టుబడడం, లేదా వేరే ఇతర కారణాల వల్ల అపరాధం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఆ దేశంలో వలస వెళ్లిన వారిపై చర్యలు కఠినంగా ఉంటున్నాయి. భారీ మొత్తంలో జరిమానా విధించడం, కఠినమైన శిక్షలు విధించడం వంటివి చేస్తున్నాయి. అందుకే చాలా మంది విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కఠినమైన నిర్ణయాలు, నియమాలు ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మన దేశంలో వ్యవహరించినట్లు వ్యవహరిస్తే శిక్షతో పాటు.. పొరుగు దేశంలో అఖండమైన భారత దేశ చరిత్రకు, భారత దేశ గౌరవానికి భంగం కలుగుతుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad