Thursday, September 19, 2024
Homeనేషనల్Bird Flu : ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేలకోళ్లు, బాతులు సహా...

Bird Flu : ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 వేలకోళ్లు, బాతులు సహా పెంపుడు..

బర్డ్ ఫ్లూ, ఎబోలా, కరోనా, ఒమిక్రాన్, జికా ఇలా ఎప్పుడూ ఏదొక వైరస్ మానవాళిపై పగబట్టినట్లు వస్తూనే ఉన్నాయి. కరోనా క్లిష్టపరిస్థితుల నుండి బయటపడి.. కరోనా ముందునాటి పరిస్థితులు ఒక్కొక్కటిగా.. చక్కబడుతున్న వేళ.. మళ్లీ వైరస్ లు తిరగబెడుతున్నాయి. నిన్న కర్ణాటకలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. తాజాగా.. కేరళలో వేలసంఖ్యలో జంతువులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది.
కొట్టాయం జిల్లాలోని అర్పూక్కర, తల యాజమ్ పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ తెలిపారు. వెంటనే బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

- Advertisement -

చర్యల్లో భాగంగా.. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న 8 వేలకు పైగా పెంపుడు పక్షులు(కోళ్లు, బాతులు)ను చంపాలని, అనంతరం క్రిమి సంహారక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు బర్డ్ ఫ్లూ వ్యాధి కేంద్రంగా ఉన్న పది కిలోమీటర్ల పరిధిలో కోళ్లు, బాతులు,పక్షులు, ఇతర పెంపుడు పక్షుల, కోడి, బాతు గుడ్లు, మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు ముప్పులేనప్పటికీ.. దానికారణంగా చనిపోయిన జంతువులను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News