India’s Largest Battery Energy Storage: దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు రంగ సంస్థ అదానీ గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాటరీ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) రంగంలో అడుగు పెట్టింది. అదానీ గ్రూప్ ఇటీవల 1,126 MW/3,530 MWh సామర్థ్యంతో అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో 700కి పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కంటైనర్లను అమర్చనున్నారు. ఒకవేళ, ఇది పూర్తయితే భారత్‌లో ఇదే అత్యంత పెద్ద బీఈఎస్‌ఎస్ ఇన్స్టలేషన్ అవుతుంది. ప్రపంచంలో ఒకే ప్రదేశంలో ఇంత పెద్ద స్థాయిలో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ బీఈఎస్‌ఎస్ ప్రాజెక్ట్ పవర్ సామర్థ్యం 1,126 మెగావాట్లు, ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యం 3,530 MWh కలిగి ఉంటుంది. అంటే, 1,126 MW పవర్‌ను 3 గంటల పాటు స్టోరేజ్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది.
భవిష్యత్తు అంతా రెన్యువెబుల్ ఎనర్జీదే..
ఈ భారీ ప్రాజెక్టుపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. “భవిష్యత్తు అంతా రెన్యువెబుల్ ఎనర్జీదే. దీనికి ఎనర్జీ స్టోరేజ్ అనేది ఒక మూలస్తంభంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము కేవలం ప్రపంచ స్థాయి ప్రమాణాలను మాత్రమే సృష్టించడమే కాదు. భారత్ ఎనర్జీ సుస్థిరతను పెంపెందించే లక్ష్యంతో పనిచేస్తున్నాము. మా ఈ ప్రయత్నం భారత్‌కు నమ్మకమైన విద్యుత్ సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం.” అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అదానీ గ్రూప్ ప్రపంచ స్థాయి ఎనర్జీ లీడర్స్ సరసన నిలబడింది. ఇది భారత్‌లో శుభ్రమైన, అతి పెద్ద నిల్వ సౌకర్యాల ఏర్పాటు విషయంలో ఒక మైలురాయిగా నిలిచింది. దీని ద్వారా దేశంలో 24 గంటలు శుభ్రమైన విద్యుత్ అందించడం, తక్కువ కార్భన్ ఉత్పత్తితో విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించడం సులభతరం అవుతుంది. బీఈఎస్‌ఎస్ సిస్టమ్ పీక్ లోడ్, ట్రాన్స్మిషన్ లోడ్ తగ్గించడానికి, సౌరశక్తి వినియోగంలో అధిక సామర్థ్యం సాధించడానికి, గ్రిడ్ నమ్మకాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రాజెక్ట్ ఖావ్డా ప్రాంతంలో, ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పత్తి శక్తి కేంద్రంలో ప్రారంభం కానుంది. ఇది ఆధునిక లిథియం-ఐయాన్ బ్యాటరీ టెక్నాలజీతో, అత్యుత్తమ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో రూపొందనునంది. తద్వారా మెరుగైన పనితీరు, విశ్వసనీయత పొందడం సులభతరమవుతుంది. అదానీ గ్రూప్ 2027 మార్చి వరకు అదనంగా 15 GWh BESS సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని, వచ్చే ఐదేళ్లలో మొత్తం 50 GWh సామర్థ్యం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ రంగం సమర్ధవంతమైన విద్యుత్ వినియోగంలో, విద్యుత్ కొరత తీర్చడంలో కీలకంగా పనిచేస్తుందని, మారు మూల ప్రాంతాలకు సైతం విద్యుత్ సరఫరా చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.


