Saturday, June 14, 2025
Homeనేషనల్India's most ordered: 2022లో మనం మెచ్చి, మెక్కినది ఏదనగా..మళ్లీ అదే.. నిమిషానికి 186 సార్లు...

India’s most ordered: 2022లో మనం మెచ్చి, మెక్కినది ఏదనగా..మళ్లీ అదే.. నిమిషానికి 186 సార్లు !

భారతీయ వంటకాల్లో ఎన్ని వెరైటీలున్నా మనవాళ్లకు నచ్చేది మాత్రం బిర్యాని అని మరోసారి తేలింది. 2022లో మోస్ట్ ఆర్డర్డ్ ఫుడ్ ఐటెంగా బిర్యానీ టాప్ లో నిలిచింది. నిమిషానికి 186 బిర్యానీల చొప్పున మనవాళ్లు లొట్టలేసుకుని లాగించేశారు. జొమాటో ఇయర్లీ రిపోర్ట్ లో మరోసారి బిర్యానీ టాప్ లో నిలిచిందన్నమాట. లక్నోవి బిర్యాని, హైదరాబాద్ బిర్యాని, కోల్ కతా బిర్యాని, బెంగళూరు బిర్యాని, చెన్నై బిర్యానీ..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలోని ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక రకమైన స్థానిక బిర్యానీ వెరైటీలు ఫేమస్.

- Advertisement -

ఒక్క జొమాటోనే కాదు స్విగ్గీ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. 2002లో స్విగ్గీలోనూ నిమిషానికి 137 బిర్యానీల ఆర్డర్స్ వచ్చాయి. ఇక పిజ్జాలు ఆ తరువాతి ప్లేస్ లో ఉన్నాయి. నిమిషానికి 139 పిజ్జాలను జొమాటో డిలివరీ చేసింది. మరోవైపు అసలు ఎలాన్ మస్క్ ఏం తింటాడు? కోహ్లి ఏం తింటాడు? అంటూ జొమాటోలో ఒకటే సర్చ్ చేశారట మనోళ్లు. ఇక ఢిల్లీకి చెందిన అంకుర్ అనే ఓ వ్యక్తి ఏకంగా 3,330 ఆర్డర్స్ తో హయ్యస్ట్ ఆర్డర్స్ చేసిన జొమాటో కస్టమర్ గా టాప్ లో నిలిచాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News