Homeనేషనల్ISRO Space Station: అంతరిక్షంలో భారత్ సొంత ఇల్లు: భారతీయ అంతరిక్ష స్టేషన్ సిద్ధం చేస్తున్న...

ISRO Space Station: అంతరిక్షంలో భారత్ సొంత ఇల్లు: భారతీయ అంతరిక్ష స్టేషన్ సిద్ధం చేస్తున్న ఇస్రో

Bharatiya Antariksh Station: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమ్ములపొదిలో మరో అద్భుతమైన అస్త్రం సిద్ధమవుతోంది. భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటివరకు స్వల్పకాలిక ప్రయోగాలకే పరిమితమైన భారత్.. ఇకపై అంతరిక్షంలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

- Advertisement -

ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన మొదటి మాడ్యూల్ ‘BAS-01’ తయారీకి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఇందుకోసం భారతీయ ఏరోస్పేస్ తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను కోరుతూ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తాజాగా అడుగులు వేసింది. ఈ మాడ్యూల్ సుమారు 3.8 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో ఉండనుంది. దీనిని తయారు చేయడానికి ‘AA-2219’ అనే అత్యంత శక్తివంతమైన అల్యూమినియం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. మానవ సహిత ప్రయోగం కాబట్టి భద్రత విషయంలో ఇస్రో ఎక్కడా రాజీ పడటం లేదు. అర మిల్లీమీటర్ తేడా వచ్చినా అంగీకరించబోమని తయారీదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

also read Naga Chaitanya: నాగ చైతన్య, హరీష్ శంకర్ కాంబో.. సెట్ అవుతుందా?

ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇది పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’ పద్ధతిలో సాగుతుంది. విదేశీ సహాయం లేకుండా కేవలం భారతీయ కంపెనీల భాగస్వామ్యంతోనే ఈ కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో నిర్ణయించింది. 2028 నాటికి మొదటి మాడ్యూల్‌ను కక్ష్యలోకి పంపాలని.. 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోగ్రావిటీలో ప్రయోగాలు చేయడం, సుదీర్ఘకాలం అంతరిక్షంలో మనుషులు నివసించేలా సాంకేతికతను అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే చంద్రుడిపై యాత్రలకు, ఇతర గ్రహాంతర ప్రయోగాలకు ఈ అంతరిక్ష కేంద్రం ఒక పునాదిగా మారుతుంది. ఇది అందుబాటులోకి వస్తే అంతరిక్షంలో సొంత కేంద్రాన్ని కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది. మన శాస్త్రవేత్తల ప్రతిభకు, భారతీయ పరిశ్రమల సామర్థ్యానికి ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఒక నిలువుటద్దంలా నిలవబోతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News