Saturday, November 15, 2025
Homeనేషనల్Train: దేశంలోనే అతి చిన్న రైలు.. ఎక్కడుందో తెలుసా..?

Train: దేశంలోనే అతి చిన్న రైలు.. ఎక్కడుందో తెలుసా..?

Kerala: భారతీయ రైల్వే… ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ వేలాది కిలోమీటర్లు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గురించి మనం తరచుగా వింటుంటాం. కానీ, మన దేశంలో ఒక రైలు కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆశ్చర్యమే కాదు, ఈ అతి చిన్న రైలు ఇచ్చే అనుభూతి మాత్రం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

- Advertisement -

కేరళ పచ్చదనంలో ఓ ప్రత్యేక ప్రయాణం
మన దేశంలోనే అత్యంత తక్కువ దూరం ప్రయాణించే ఈ ప్రత్యేకమైన రైలు… కేరళలోని కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకుళం జంక్షన్ వరకు నడుస్తుంది. ఇది కేవలం 9 కిలోమీటర్ల దూరాన్ని, మధ్యలో ఒకే ఒక్క స్టాప్‌తో, 40 నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ DEMU (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుకు కేవలం మూడు కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

ప్రకృతి రమ్యతకు అద్దం
ఈ రైలు కేవలం చిన్న ప్రయాణమే కాదు, దాని మార్గం అందించే అద్భుతమైన దృశ్యాల కారణంగా ఇది ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కొచ్చిన్ హార్బర్ నుండి ఎర్నాకుళం జంక్షన్ వైపు వెళ్లే ఈ దారిలో.. కేరళలోని దట్టమైన అడవులు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన నదీ తీరాలు వంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు ప్రయాణీకులకు కనువిందు చేస్తాయి. ప్రతి మలుపులోనూ ప్రకృతి అద్భుతమైన పెయింటింగ్‌ను ఆవిష్కరించినట్లుగా ఉంటుంది.

స్థానికులకు తెలియని అద్భుతం
ఈ రైలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నడుస్తుంది. అయితే, ఆశ్చర్యకరంగా ఈ రైలులో స్థానికులు చాలా అరుదుగా ప్రయాణిస్తారు. ఈ మూడు కోచ్‌ల రైలు సామర్థ్యం సుమారు 300 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. కానీ, చాలా సార్లు కేవలం 10-12 మంది ప్రయాణీకులతోనే నడుస్తుంది. అందుకే ఈ చిన్న ప్రయాణం, ప్రకృతి ప్రేమికులకు, రైల్వే అద్భుతాలను చూడాలనుకునే వారికి ఒక గోప్యమైన అన్వేషణలాంటిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad