Tuesday, September 10, 2024
Homeనేషనల్Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

జబల్‌పూర్, సెప్టెంబ‌రు 1 (తెలుగు ప్ర‌భ‌): జబల్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 7308కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్ వైపు మళ్లించారు. ప్రయాణికులందరినీ డీబోర్డ్‌లోకి దించామ‌ని, తక్షణమే భద్రతా తనిఖీలు ప్రారంభించామని ఇండిగో తెలిపింది. కాగా ఇటీవలే ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు మెసేజ్‌ రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘హై అలర్ట్’ ప్ర‌క‌టించారు. విమానాన్ని క్షుణ్ణంగా భద్రతా తనిఖీ చేసిన తర్వాతే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు వలియతుర పోలీస్ స్టేషన్ అధికారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకుముందు మే నెలలో ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్‌లో బాంబు అని రాసిన‌ టిష్యూ పేపర్‌ను గ‌మ‌నించారు. దీంతో విమానంలో సోదాలు నిర్వహించగా, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కాగా తాజా ఉదంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించామని, వారు ప్రయాణికులను విమానంలో నుంచి దిగమని కోరినట్లు ఇండిగో అధికారి తెలిపారు. విమానంలో క్షుణ్ణంగా త‌నిఖీలు జ‌రిపామ‌ని, అయితే ఏమీ దొరకలేదన్నారు. అనంతరం మరో విమానంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త‌ర‌లించామ‌ని ఆ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News