Sunday, October 6, 2024
Homeనేషనల్New Law : సహజీవనం ఇకపై చట్టరీత్యా నేరం.. ఉల్లంఘిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే

New Law : సహజీవనం ఇకపై చట్టరీత్యా నేరం.. ఉల్లంఘిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే

పెళ్లికి ముందే సహజీవనం, శృంగారం చేయడం షరా మామూలైపోయింది. దానిపై ఉక్కుపాదం మోపుతూ ఇండోనేషియా ప్రభుత్వం కొత్తచట్టం తెచ్చింది. ఇకపై పెళ్లికి ముందు శృంగారం చేయడం నిషేధమని చెప్పింది. ఇప్పటికే అక్కడ స్వలింగ సంపర్కంపై నిషేధం ఉంది. జకర్తాలో జరిగిన పార్లమెంటరీ ప్లీనరీ సమావేశంలో ఈ కొత్త చట్టాన్ని ఇండోనేషియా న్యాయశాఖ మంత్రి యసోన్నా లావోలీకి పార్లమెంటరీ కమిషన్ అధిపతి బాంబాంగ్ వుర్యాంటో అందజేశారు. ఈ బిల్లుపై ఇండోనేషియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

- Advertisement -

ఇకపై ఇండోనేషియాలో ఈ కొత్త చట్టం ప్రకారం భార్యాభర్తలు మాత్రమే శారీరక సంబంధం కలిగివుండాలి. పెళ్లికి ముందు ఎవరితోనైనా శారీరక సంబధం కలిగి ఉండడం చట్ట విరుద్ధం, అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. 6 నెలల నుండి ఏడాది కాలం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అలాగే.. వివాహేతర సంబంధాలను కూడా ఇకపై నేరంగా పరిగణిస్తారు. పెళ్లైన జంట విషయంలో మహిళ లేదా పురుషుడు వారి భాగస్వామిపై కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం కోర్టులో విచారణకు ముందు ఫిర్యాదును ఉపసంహరించుకోవచ్చు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే.. దీని నుండి అక్కడికి వెళ్లే పర్యాటకులకు మినహాయింపు ఉంది. ఈ చట్టం అక్కడి నివాసితులకు మాత్రమే వర్తిస్తుందని ఓ అధికారి స్పష్టం చేశారు. మరోవైపు ఈ చట్టంపై ఆ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News