ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ 41 ఏండ్ల వ్యక్తిని కొట్టి చంపారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతడిని చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
మృతుడిని.. భద్రు సోడిగా పోలీసులు గుర్తించారు. బైరాంఘర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేశముండి గ్రామ వాసి భద్రు అని తెలుస్తోంది. భద్రు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక భద్రును చంపిన ప్రదేశంలో మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లిపోయారు.
సోడి యాంటీ మావోయిస్టు సివిల్ మిలిషీయా సల్వా జుడుం మూవ్మెంట్లో యాక్టివ్‌గా పాల్గొన్నారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో కీలకంగా ఉన్నాడని తెలిపారు.. అందుకే హత్య చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.