Innovation Andhra: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆవిష్కరణ ఆంధ్ర’ కార్యక్రమం గిన్నిస్ రికార్డులకెక్కింది. 24 గంటల్లో అత్యధికంగా పారిశ్రామిక వేత్తలు పేర్లు నమోదు కావడంతో ఈ కార్యక్రమం గిన్నిస్ రికిర్డుకెక్కింది. ఆన్ లైన్ లో గడిచిన 24 గంటల్లో 1.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ప్రపంచ రికార్డు లభించింది. రికార్డు సర్టిఫికేట్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందించారు. ఆవిష్కరణ ఆంధ్రపై నేతలు, పారిశ్రామికవేత్తలు ప్రమాణం చేశారు. ప్రతీ కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసే దిశగా కృషి చేస్తామని చంద్రబాబు, లోకేశ్, పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు.
Read Also: Scuba diver: శివమణి సినిమా స్టోరీ రిపీట్.. కాకపోతే ట్విస్ట్ అదుర్స్..!
ఆవిష్కరణ ఆంధ్ర కార్యక్రమం
కాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల హబ్‌లను ఏర్పాటు చేయడం, స్టార్టప్ కంపెనీలను నెలకొల్పడం, పెట్టుబడులను ఆహ్వానించడం, పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలకు ప్రోత్సాహాలు ఇవ్వడం, కుటుంబానికో పారిశ్రామికవేత్త, రాష్ట్రవ్యాప్తంగా గ్రిడ్లు ఏర్పాటు వంటి అంశాలతో ఆవిష్కరణ ‘ఆంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, మంగళగిరి, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మంగళగిరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా హబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబును కలిసి గిన్నిస్ రికార్డును అందజేశారు.
Read also: Asia Cup 2025: గిల్ పై చీఫ్ సెలక్టర్ అగార్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!


