Saturday, November 15, 2025
Homeనేషనల్Instagram: ఇకపై ఇన్‌స్టాలో ఆ కంటెంట్ చూడాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

Instagram: ఇకపై ఇన్‌స్టాలో ఆ కంటెంట్ చూడాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

Meta: సోషల్ మీడియా ప్రపంచంలో యువతను, ముఖ్యంగా టీనేజర్లను ఎంతగానో ఆకర్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, వారి భద్రత కోసం కొత్త, కఠినమైన నిబంధనను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta) తాజాగా చేసిన ఈ ప్రకటన టీనేజర్ల ఆన్‌లైన్ అనుభవాన్ని మార్చనుంది.

- Advertisement -

గతేడాది టీనేజర్‌లు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన మెటా, ఇప్పుడు వారికి డిఫాల్ట్‌గా PG-13 కంటెంట్ మాత్రమే కనిపించేలా సెట్టింగ్‌లను మార్చేసింది. అంటే, మైనర్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లోకి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేయబడిన కంటెంట్‌ను మాత్రమే చూడగలుగుతారు.

ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు?
ఈ కొత్త నిబంధన ప్రకారం, టీనేజర్ల ఇన్‌స్టా అకౌంట్స్‌లో ఎలాంటి అసభ్యకరమైన లేదా శృంగారభరితమైన ఫొటోలు,వీడియోలు, హింస,నేరాలకు సంబంధించిన కంటెంట్ కనిపించదు. అంతేకాకుండా, మత్తుపదార్థాలకు సంబంధించిన పోస్టులు, ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించిన కంటెంట్ కూడా నిరోధించబడుతుంది. దీని ద్వారా వారు కేవలం 18 ఏళ్ల లోపు వారికి తగిన (Age-Appropriate) కంటెంట్‌ను మాత్రమే చూడగలుగుతారు.

ఒకవేళ టీనేజర్‌లు ఈ డీఫాల్ట్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయాలనుకుంటే, దానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియాలో వచ్చే హానికరమైన కంటెంట్ వల్ల మైనర్‌లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారనే ఆరోపణలు, ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో మెటా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్య టీనేజర్లకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడానికి మెటా కట్టుబడి ఉందనడానికి నిదర్శనం. యువత ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు తల్లిదండ్రులకు, సంరక్షకులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad