Office Romance India at 2nd Place: ఓ వ్యక్తి తన కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇంట్లో వారితో కంటే బయటివారితోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. మహిళలు లేదా పురుషులు ఎవరైనా కావొచ్చు. అది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ సంబంధం మరో బంధానికి కూడా దారితీస్తోంది. అదే ఆఫీసులో ప్రేమాయణం. భారత్‌లో చాలా మంది ఉద్యోగులు తమ సహోద్యోగులతో డేటింగ్‌లో ఉంటున్నారని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/gallery/health-benefits-of-eating-black-carrots/
అంతర్జాతీయ సంస్థ ఆష్లే మాడిసన్.. YouGov సహకారంతో 11 దేశాల్లో అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం ప్రతి పది మంది భారతీయుల్లో నలుగురు.. సహోద్యోగులతో డేటింగ్ చేశారని లేదా ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు తేలింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మెక్సికో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ సర్వేలో మెక్సికో, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల నుంచి 13,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.
అయితే కార్పొరేట్, మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులు వృత్తిపరమైన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేందుకు.. అసంబద్ధమైన కార్యకలాపాలు కొనసాగకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలను తీసుకొచ్చాయి. ఈ క్రమంలో భారత్‌లో POSH యాక్ట్ అమలవుతోంది. వర్క్‌ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లయితే ఈ చట్టం ప్రకారం వారిపై సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. కానీ, ఇద్దరి అంగీకారంతో డేటింగ్ జరిగినట్లయితే ఈ చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోలేరు.
అంతర్జాతీయ సర్వే ప్రకారం భారత్‌లో సహోద్యోగితో ప్రేమాయణంలో మహిళల కంటే ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారని తేలింది. యువ ఉద్యోగులు, ముఖ్యంగా 18-24 సంవత్సరాల వయసు వారు డేటింగ్‌లో ఇంట్రస్ట్‌గా ఉన్నారట. అయితే ఆఫీస్ డేటింగ్ వారి కెరీర్‌లను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై కూడా ఉద్యోగులు జాగ్రత్తగా ఉన్నారని సర్వే వెల్లడించింది. కానీ, ఉద్యోగులు తమ ఆఫీసును కేవలం పని ప్రదేశంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత సంబంధాల కోసం ఓ ప్లాట్‌ఫామ్‌గా చూడటం ఆందోళన కలిగించే విషయం.
Also Read: https://teluguprabha.net/national-news/amitshah-on-redfort-blast/
అవివాహేతర సంబంధాలను తగ్గించేందుకు.. ఉద్యోగి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ కంపెనీలు పలు విధానాలు తీసుకొచ్చినా ఇలాంటి ధోరణి కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగులు అవివాహితులు అయితే వారి ఆఫీస్ రొమాన్స్.. పెళ్లి వరకూ వెళ్తుందా లేదా అనేది వారికే తెలియాలి. కానీ వివాహితులు అయితే వారి వైవాహిక జీవితాన్ని, జీవిత భాగస్వామిని ఎంతగా మోసం చేస్తున్నారో వారి మనస్సాక్షికే సమాధానం చెప్పుకోవాలి.

