Wednesday, January 22, 2025
HomeదైవంMaha Kumbh Mela: ఆకాశం నుంచి కుంభమేళా ఫొటోలు ఎలా ఉన్నాయంటే..?

Maha Kumbh Mela: ఆకాశం నుంచి కుంభమేళా ఫొటోలు ఎలా ఉన్నాయంటే..?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ వేడుకకు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. నాగసాధువులు, అఘోరాలతో పాటు సాధారణ భక్తులు కూడా అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో వర్థిల్లుతోంది. తాజాగా ఈ కుంభమేళాకు సంభించిన స్పేస్ వ్యూ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) విడుదల చేసింది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ల ఏర్పాటు చేయడంతో గత కొన్ని నెలల ముందుకు, ఇప్పటికీ మధ్య తేడా ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది.

- Advertisement -

2024 ఏప్రిల్ 6వ తేదీ ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించింది. 2024డిసెంబర్ 22, 2025 జనవరి 10న తీసిన చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్‌ కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్‌లా ఆ పార్క్ కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాలో 40కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ వేడుక ద్వారా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని వెల్లడించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News