Thursday, January 16, 2025
Homeనేషనల్ISRO: ఇస్రో మరో ఘనత.. అగ్ర దేశాల సరసన భారత్

ISRO: ఇస్రో మరో ఘనత.. అగ్ర దేశాల సరసన భారత్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ((ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో స్పేడెక్స్‌(SpaDeX) డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూరర్తి చేసింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఇస్రో వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 30న శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌)లో నుంచి SDX01(ఛేజర్‌), SDX02 (టార్గెట్‌) శాటిలైట్లను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ60 (PSLV) ద్వారా నింగిలోకి పంపింది. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్‌-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్‌-1ఎ రాకెట్‌ నుంచి విడిపోయాయి.

- Advertisement -

ఆ తర్వాత వీటి డాకింగ్‌ కోసం మూడుసార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. గురువారం రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్‌ చేసి డాకింగ్‌ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ విజయం కోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు, సాంకేతిక బృందానికి, యావత్‌ భారతీయులకు అభినందనలు తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News