జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) స్పందించారు. మోదీకి ఇప్పుడు తత్వం బోధిపడిందని తెలిపారు. గతంలో తాను దేవుడు పంపిన ప్రతినిధిని అని మోదీ ప్రకటించుకున్నారని.. అందుకే ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారని వ్యాఖ్యానించారు.
కాగా నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న మోదీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను గుర్తు చేసుకున్నారు. కష్టపడి పనిచేయడానికి వెనకాడనని.. దురుద్దేశాలతో ఏ తప్పూ చేయనని తెలిపారు. ఇదే తన జీవిత మంత్రమని చెప్పారు. అయితే కొన్ని తప్పులు చేసి ఉండవచ్చని తానూ మనిషినే.. భగవంతుడిని కాదు కదా అని ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం ప్రసగించినట్లు వెల్లడించారు.
ఇక రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటనే ప్రశ్నకు.. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం కాకుండా ప్రజాసేవ కోసం రావాలని సూచించారు.