లోక్‌సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే(Arjun Ram Meghwal) ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ విపక్ష పార్టీలు సభలో ఆందోళన చేస్తున్నాయి. కాగా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
ఇదిలా ఉంటే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ(NDA)కు 293 మంది ఎంపీల మద్దతు ఉండగా.. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.
తొలుత ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి బిజినెస్ జాబితాలో బిల్లులను లిస్ట్ చేశారు. అయితే తర్వాత వెనక్కి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు సభలో ప్రవేశపెట్టింది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గంలో జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.