Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కిష్త్వార్ లో 60 మందికి పైగా మరణించిన ఘటన మరువకముందే, కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర భయాందోళనలను సృష్టించాయి.
భారీ వర్షాలు, నష్టం
శనివారం మధ్య రాత్రి సంభవించిన ఈ క్లౌడ్ బరస్ట్స్ వల్ల జోధ్ ఘాటి ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ వరద నీటిలో, శిథిలాల కింద అనేక ఇళ్లు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, జాంగ్లోట్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మరో ఇద్దరు మరణించారు. జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారి, రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నాయి, దీనివల్ల రవాణా నిలిచిపోయింది.
సహాయక చర్యలు ముమ్మరం
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని గ్రామాలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా, సహాయక బృందాలు అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. కథువా పోలీస్ స్టేషన్ పూర్తిగా నీట మునిగిపోయింది. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తోంది.
Infant Murder: ‘డిప్రెషన్’తో 45 రోజుల పసికందు గొంతు కోసి చంపిన కన్నతల్లి
ప్రభుత్వ సహాయం, జాగ్రత్తలు
జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ప్రజలు తమ భద్రత కోసం నీటి వనరులకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అండగా నిలిచింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రాంతాలను పరిశీంచడంతో పాటు, క్షతగాత్రులను ఆయన పరామర్శించే అవకాశం ఉంది.


