పహల్గామ్ మృతుల కుటుంబాలకు(Pahalgam Terror Attack) జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించింది. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయలతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు. మహిళలను, చిన్నారులను మాత్రం విడిచి పెట్టేశారు.
ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక సంఘటనాస్థలిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను అధికారులు విడుదల చేశారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, చైనా, నేపాల్, ఇరాన్, ఇటలీ, ఇజ్రాయెల్ ప్రకటించాయి.