Sunday, April 20, 2025
Homeనేషనల్Cloud Burst: జమ్మూకశ్మీర్‌ను కుదిపేసిన క్లౌడ్ బరెస్ట్..!

Cloud Burst: జమ్మూకశ్మీర్‌ను కుదిపేసిన క్లౌడ్ బరెస్ట్..!

జమ్మూకశ్మీర్‌కు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా పలు ఏరియాలో భారీ వర్షాలు కురిసాయి. మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురవడొంతో.. కొండ చరియాలు విరిగివిరిగి పడగా.. వాగులు ఉప్పొంగాయి. ముఖ్యంగా రాంబన్ జిల్లా వరద ఉద్ధృతికి పూర్తిగా కుదేలైపోయింది. ధరంకుండ్ గ్రామం చీనాబ్ బ్రిడ్జి సమీపంలో గల్లంతవుతున్నట్టే ఉంది. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు నీటి ప్రవాహంలో తేలిపోతున్నాయి. కొంతమంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ విపత్తులో దాదాపు 100 మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాపాయ పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కానీ ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు మూసుకుపోయాయి. కొన్ని వాహనాలు మట్టి కింద పూడిపోయాయి. ఇప్పటివరకు గత అయిదేళ్లలో లేని విధంగా భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతాన్ని ప్రకృతి తీవ్రంగా పరీక్షిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. సహాయ చర్యలు అన్ని దశల్లో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అధికారులతో సమన్వయంగా ముందజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..
ఒకేచోట కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం.. కొండలు, లోయలు నిండిపోయేంత నీటి వర్షం… ఇది సాధారణ వాన కాదు. ఇది ప్రకృతి ఉక్కిరిబిక్కిరి చేసే విపరీత పరిస్థితి. ఒకటి నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో, గంట సమయంలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అతి తక్కువ సమయంలో కురిసి ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రధానంగా కొండప్రాంతాల్లో ఇది తరచూ కనిపిస్తుంది.

ఇది సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా జరగొచ్చు. అటవీ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, పర్వత ప్రాంతాలు ముఖ్యంగా ఇలాంటివి ఎదుర్కొంటుంటాయి. ఓ సారి క్లౌడ్ బరస్ట్ జరిగితే గ్రామాలు కుదేలవుతుంటాయి. ఇళ్లు కూలిపోతాయి. వాహనాలు కొట్టుకుపోతాయి. ఈ విపత్తును ముందుగా గుర్తించడం చాలా కష్టం. డోప్లర్ రాడార్ వంటి ఆధునిక పరికరాల సహాయంతోనే కొంతవరకు అంచనా వేయగలుగుతారు. కానీ ఖచ్చితంగా గుర్తించడం కష్టం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News