Jammu Kashmir Floods: ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు జమ్ముకశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. దీంతో 30 మంది యాత్రికులు మరణించారు. కాత్రాలోని సుప్రసిద్ధ మాతా వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. మరో 23 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు. ఆర్మీ, NDRF రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/national-news/vande-bharat-last-minute-ticket-booking/
ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా..
మరోవైపు, దోడా జిల్లాలో మేఘవిస్ఫోటం కారణంగా నలుగురు మృతి చెందినట్లు తెలిసింది. కతువా, కిశ్త్‌వాడ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. పవర్ లైన్లు, టవర్స్ ధ్వంసమై జనజీవనం స్తంభించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపేశారు.
అలానే చీనాబ్, తావి, రావిలతో పాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి.


