Friday, November 22, 2024
Homeనేషనల్Terror-Threat Fallout: జర్నలిస్టులే ఉగ్రవాదుల టార్గెట్.. గగ్గోలు పెడుతున్న పత్రికా లోకం!

Terror-Threat Fallout: జర్నలిస్టులే ఉగ్రవాదుల టార్గెట్.. గగ్గోలు పెడుతున్న పత్రికా లోకం!

- Advertisement -

Terror-Threat Fallout: జర్నలిస్టులకు పదేపదే బెదిరింపు కాల్స్ వస్తుండటంతో జమ్ము, కశ్మీర్ లో టెన్షన్ నెలకొంది. దీంతో ఇక్కడ పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం పొంచి ఉందని పత్రికా లోకం గగ్గోలు పెడుతోంది. ఇప్పటికే ఐదుగురు జర్నలిస్టులు లష్కర్ హిట్ లిస్టులో ఉన్నాయన్న కారణంతో తమ ఉద్యోగాలను వీరు వదలుకుంటున్నట్టు వెల్లడించారు.

మరోవైపు వివిధ మీడియా హౌసుల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు కూడా రాజీనామాల బాట పట్టారు. 21 మంది పత్రికా యజమానులు, ఎడిటర్లు, రిపోర్టర్లు ఇలా జర్నలిజంలో వివిధ స్థాయిల్లోని వారి ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే వార్త నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి, విచారణ వేగవంతం చేశారు. జమ్మూ కశ్మీర్ లో భారీగా సోదాలు చేస్తున్నారు.

గ్రేటర్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, ఏషియా న్యూస్ నెట్వర్క్ వంటి సంస్థలు బెదిరింపులు అందుకున్న వాటిలో ఉండటం విశేషం. ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తమ రాజీనామా లేఖలను బహిరంగంగా రిపోర్టర్లు పోస్ట్ చేస్తుడటం వైరల్ గా మారింది. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో ఉగ్ర మూకలు జర్నలిస్టులను టార్గెట్ గా పెట్టుకోవటంపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News