Saturday, November 15, 2025
Homeనేషనల్TRAVEL ALERT: కార్బెట్ పార్క్ ట్రిప్ వేస్తున్నారా? నకిలీ ఏజెంట్లతో జర భద్రం! లక్షలు పోగొట్టుకున్న...

TRAVEL ALERT: కార్బెట్ పార్క్ ట్రిప్ వేస్తున్నారా? నకిలీ ఏజెంట్లతో జర భద్రం! లక్షలు పోగొట్టుకున్న పర్యాటకులు!

Jim Corbett booking scam : దీపావళి సెలవుల్లో పులల మధ్య విహరించాలని, అడవిలో రాత్రి బస చేయాలని కలలు కంటున్నారా? అయితే, ఆ కలలను సైబర్ నేరగాళ్లు కబళించే ప్రమాదం ఉంది! దేశంలోని ప్రముఖ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ, నైట్ స్టే బుకింగ్ పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ఇన్‌స్టాగ్రామ్ ఐడీలతో పర్యాటకులకు వల వేసి, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఈ వలలో చిక్కి లబోదిబోమంటున్నారు. అసలు ఈ మోసం ఎలా జరుగుతోంది..? మీరు మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

- Advertisement -

అసలేం జరిగిందంటే..? రెండు కేసులు.. ఒకే మోసం..
కేసు 1: ఢిల్లీకి చెందిన నిఖిల్ మెహ్రా, కార్బెట్ పార్కులో సఫారీ, రాత్రి బస కోసం రామ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడిని (ఏజెంట్) సంప్రదించాడు. రూ.1.32 లక్షలు చెల్లించి, బుకింగ్ చేసుకున్నాడు. తీరా, పార్కుకు వెళ్లాక, తనకు ఇచ్చిన పర్మిట్ నకిలీదని తెలిసి, తాను మోసపోయానని గ్రహించాడు.

కేసు 2: అదే ఏజెంట్, అక్టోబర్ 12న కేరళకు చెందిన మనోజ్‌ అనే పర్యాటకుడి నుంచి రాత్రి బస పేరుతో రూ.80,000 వసూలు చేశాడు. అతనికి కూడా నకిలీ పర్మిట్ ఇచ్చి మోసం చేశాడు. ఈ రెండు కేసుల్లోనూ, నిందితుడు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సృష్టించి, వన్యప్రాణుల ఫోటోగ్రఫీ టూర్లంటూ పర్యాటకులను ఆకర్షించినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు తీవ్రంగా పరిగణించడం లేదని, దీనివల్ల మోసగాళ్లకు అలుసైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల హెచ్చరిక.. అధికారిక వెబ్‌సైట్ ఇదే : ఈ వరుస మోసాల నేపథ్యంలో, కార్బెట్ నేషనల్ పార్క్ అధికారులు పర్యాటకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

సఫారీ, రాత్రి బస వంటి బుకింగ్‌ల కోసం, కేవలం మా ఏకైక అధికారిక వెబ్‌సైట్ https://corbettgov.org ను మాత్రమే ఉపయోగించండి. అనధికారిక ఏజెంట్లు, ప్రైవేట్ వెబ్‌సైట్‌ల బారిన పడి మోసపోవద్దు.”
– కార్బెట్ నేషనల్ పార్క్ అధికారులు

మోసపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి : మీరు కూడా ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, ఈ సూచనలను తప్పక పాటించండి. అధికారిక వెబ్‌సైట్‌నే నమ్మండి: ఏ బుకింగ్ అయినా, అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చేయండి. గూగుల్‌లో కనిపించే మొదటి లింక్‌నే గుడ్డిగా నమ్మొద్దు.

నకిలీ ప్రొఫైళ్లతో జాగ్రత్త: సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఆఫర్లతో కనిపించే ప్రొఫైళ్లను, ఈ-మెయిళ్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించండి.
రశీదు తప్పనిసరి: ఒకవేళ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుంటే, ఫిర్యాదు చేయడానికి వీలుగా ఉండేలా సరైన రశీదు, కాంట్రాక్టు తీసుకోండి.
తక్షణ ఫిర్యాదు: అనుమానం వచ్చినా, మోసపోయినట్లు తెలిసినా, వెంటనే పోలీసులకు, పార్క్ అధికారులకు ఫిర్యాదు చేయండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీ ఆనందకరమైన యాత్ర, ఓ పీడకలగా మారకుండా చూసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad