Friday, November 14, 2025
Homeనేషనల్JioDown : దేశవ్యాప్తంగా డౌన్ అయిన జియో సేవలు..ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్

JioDown : దేశవ్యాప్తంగా డౌన్ అయిన జియో సేవలు..ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. పలు ప్రధాన నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఆగకపోయినా.. యూజర్లు కాలింగ్, మెసేజ్ లతో సమస్యలు ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుండి యూజర్లు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో జియోని ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదు చేశారు. కానీ ఆ సంస్థ నుండి ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు. సోమవారం రాత్రి సుమారు 3 గంటల సమయం పాటు జియో సేవలకు అంతరాయం కలిగింది.

- Advertisement -

మొబైల్ ఇంటర్నెట్ సేవలు మాత్రం అందుబాటులో ఉన్నా కాల్స్, మెసేజ్ లు చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఓ యూజర్ తన మొబైల్‌లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు ట్వీట్‌ చేశారు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నిస్తూ.. పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్‌ అవుతోంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ జియో సేవలకు అంతరాయం కలగడంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై వినియోగదారుల నుండి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad